హైదరాబాద్: దివంగత దళిత నేత, లోక్ సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి వర్థంతిని ఈరోజు టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు. పలువురు నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రెండు నిముషాలు మౌనం పాటించారు. అత్యున్నత స్థానాలను అధిరోహిస్తున్న సమయంలో బాలయోగి మృతి దురదృష్టకరమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో తూ.గో జిల్లాకు చెందిన నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.