జంగారెడ్డిగూడెం: వైఎస్ పర్సనల్ సెక్యూరిటీ అయిన సూరీడు తన శిష్యుడని, వైఎస్ వర్గం పన్నిన కుట్రలను అతనే తనకు చెప్పేవాడని ఆయన వెల్లడించారు. కాంగ్రెసును ఎన్నికల్లో ఓడించేందుకు ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అంతేగాక కాంగ్రెసు అవినీతిపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని ప్రకటించారు. కాంగ్రేస్ పార్టీ నాయకులు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. పొత్తుకు సంబంధించి ఇప్పటికే మహాకూటమి నాయకులు తనను సంప్రదించారన్నారు. అవినీతిలో రికార్డు సాధించిన కాంగ్రెసును భూస్థాపితం చేయడమే తన లక్ష్యమన్నారు.