తెలంగాణ సెంటిమెంట్ లేదు: పీఆర్పీ
హైదరాబాద్: "అవునయ్యా...తెలంగాణవాదం పడిపోతోంది కదా? బాగా క్షీణించింది కదా! టీఆర్‌ఎస్ ఏమైందో చూడండి. ఎక్కడుంది టీఆర్‌ఎస్?'' అంటూ ప్రజారాజ్యం పార్టీ సీనియర్ నేత, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ పి శివశంకర్ తేల్చిపారేయటం అంతటా కలకలం సృష్టిస్తోంది. ప్రజారాజ్యం ముసాయిదా మేనిఫెస్టోను గురువారం విడుదల చేశారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ శివశంకర్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. టీఆర్‌ఎస్ కూడా దీనిపై తీవ్రంగా స్పందించింది. శివశంకర్ వ్యాఖ్యలతో విపక్షాలకు-ముఖ్యంగా తాము తెలంగాణపై పదేపదే నిలదీస్తున్న మహాకూటమికి అనవసరంగా అవకాశం కల్పించినట్లయిందన్న భావన పార్టీవర్గాల్లో వ్యక్తమైంది.
మరో ప్రక్క పీఆర్పీలో తెలంగాణకు చెందిన దేవేందర్ గౌడ్, జల్లి సిద్ధయ్య లాంటి వారు దీనిపై అంతర్గతంగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా పార్టీపెట్టి తర్వాత ఆ లక్ష్యసాధన కోసమే తన పార్టీని పీఆర్పీలో విలీనం చేసినట్టు చెప్పిన సీనియర్ నేత దేవేందర్‌గౌడ్‌కు ఈ వ్యాఖ్యలు ఇబ్బందికరంగా పరిణమించాయి. దీనిపై తాను ఏం సమాధానం చెప్పుకోవాలని ఆయన ఆందోళన వ్యక్తంచేసినట్టు తెలిసింది. తెలంగాణపై ప్రజాభీష్టానికి అనుగుణంగా నడుచుకుంటామని పీఆర్పీ మేనిఫెస్టోలో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications