టీడీపి లోకి కేశినేని నాని
హైదరాబాద్:విభేదాలతో,వివాదాలతో ప్రజారాజ్యం పార్టీని వీడిన కేశినేని నాని తొమ్మిదో తేదీన లాంఛనంగా తెలుగుదేశం లో చేరనున్నారు. దీని నిమిత్తం కేశినేని తన అనుచరులతో స్వస్థలం నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వరకూ ర్యాలీగా రానున్నారని సమాచారం. సీట్ల పంపిణీ జరుగుతున్న వేళ ఈ భారీర్యాలీ తెలుగు దేశం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయింది.
ఇక జనవరి 26న జెండా వందన కార్యక్రమంలో కృష్ణా జిల్లా పిఆర్పీ కన్వీనర్ విజయనిర్మలను, రూరల్ కన్వీనర్‌గా ఉన్న కేశినేని అడ్డగించారు. ఈ వివాదంపై ప్రజారాజ్యం నాయుకుడు అల్లు అరవింద్ సమక్షంలో జరిగిన పంచాయితీ అనంతర పరిణామాలతో కేశినేని పిఆర్పీ నుంచి బహిష్కరించారు. దీనితో ఇప్పుడు ఆయన టిడిపి లో చేరుతున్నారు. ఇక కేశనేని ..తెలగు దేశం లోకి రావటం చాలామంది పార్టీ వర్గీయులను ఆనందపరిచే అంశం.












Click it and Unblock the Notifications