రోడ్డు ప్రమాదంలో 5 గురు మృతి
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 5గురు మృతి చెందగా 15 మంది గాయపడ్డారు. కాళ్ల మండలం దొడ్డనపూడికి చెందిన కూలీలు పని నిమిత్తం కృష్ణా జిల్లా గుడివాడ వెళ్లి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరంతా ఓ ఇసుకలారీలో తిరిగివస్తుండగా జువ్వలపాలెం వద్ద లారీ అదుపుతప్పి కాల్వలో పడింది. దీంతో 5గురు మృతి చెందగా 15 మంది గాయపడ్డారు.












Click it and Unblock the Notifications