హైదరాబాద్: బాధ్యతగల ఉద్యోగం చేస్తూ పార్టీ కార్యకర్తలా ప్రభుత్వాన్ని పొగిడిన డీజీపీ యాదవ్‌పై ఈసీకి ఫిర్యాదు చేస్తానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తెలిపారు. మహాకూటమి ఏర్పాటుతో తాను ఇన్నేళ్లుగా అవినీతికి పాల్పడి సంపాదించిన డబ్బు ఏమైపోతుందోనన్న భయం వై.ఎస్ కు పట్టుకుందని ఆయన ఎద్దేవా చేశారు. ఆయనకు ఇప్పుడు కలలో కూడా తానే కన్పిస్తున్నానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
డిజిపి యాదవ్ ను విమర్శించడం ద్వారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో గణనీయ సంఖ్యలో ఉన్న యాదవుల ఓట్లను కోల్పోయే అవకాశముందని టిడిపిలోని యాదవ నాయకులే గుసగుసలాడుకుంటున్నారని తాజా సమాచారం.