హైదరాబాద్: మెదక్ పార్లమెంటు స్థానం నుంచి విజయశాంతి పోటీచేస్తారని.. ఆమె కాకపోతే తానే అక్కడి నుంచి పోటీ చేస్తానని టీఆర్ ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ స్పష్టం చేసారు. మెదక్ జిల్లా సంగారెడ్డి నుంచి కాంగ్రెస్ నాయకుడు జలాలుద్దిన్ బాబా తెరాసలో చేరిన సందర్భంగా గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. గత కొద్ది రోజులుగా మెదక్ నుంచి ఎవరు పోటీ చేస్తారన్న విషయంపై పార్టీలో ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించటం తో పార్టీ వర్గాల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. మెదక్ లోక్ సభ స్థానం అత్యంత ప్రతిష్ఠాత్మకమైనదని, ఇక్కడ తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టి సత్తా చాటాలని పిలుపునిచ్చారు.