హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంకోసం తలనరుక్కోవడానికి సిద్ధంగా ఉన్నవారికే టిక్కెట్లు ఇస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ పార్టీ టెక్కెట్లుపై మాట్లాడారు. తెలంగాణ ద్రోహులకు సీట్లు ఇచ్చేదిలేదని తేల్చి చెప్పారు. మహా కూటమి ఏర్పాటుతోనే, కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమైపోయిందన్నారు. రాష్ట్రంలో మహాకూటమి నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పడబోతోందని, కూటమికి ఒక్క తెలంగాణలోనే 105 సీట్లు వస్తాయని జోస్యంచెప్పారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పాతరేయడం ఖాయమని, తెలంగాణ రావాలంటే కాంగ్రెస్ పోవాలని చెప్పారు. సంగారెడ్డి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టిక్కెట్టు పొందిన వ్యక్తి దుర్మార్గానికి ఒడిగట్టారని, ఉద్యమానికి ద్రోహం చేశారన్నారు. ఈసారి ఎన్నికల్లో ఉద్యమానికి అండగాఉండి..మూడోఫ్రంట్‌కు ఆవిర్భావం జరిగిందని, ఎన్నికల అనంతరం తెలంగాణకు అనుకూలంగా ఉన్న కూటమితోనే వెళ్తామన్నారు.