హైదరాబాద్: ప్రజారాజ్యం అధినేత చిరంజీవిపై సెటైర్స్ చేస్తూ చేసే ఏ చిత్రమైనా ఫ్లాఫ్ అవుతుందని, అదే తరహాలో మేస్త్రి కూడా ఫ్లాప్ అవటం తధ్యమంటూ ప్రజారాజ్యం పార్టీ నేత తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. మేస్త్రి సినిమాలో ప్రజారాజ్యం పై వ్యంగ్య బాణాలున్నాయంటూ ఓ ఛానెల్ వారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన అలా చెప్పుకొచ్చారు. తాను మేస్త్రి సినిమాను చూడలేదని, అలాగే దాసరి ఇలా ఒక వ్యక్తిని, ఒక వ్యవస్ధను విమర్శ చేస్తూ, టార్గెట్ చేస్తూ సినిమా చేయటం పధ్ధతి కాదన్నారు. తమ పార్టీ ఇంకా శైశవ దశలోనే ఉందని,పార్టీ అధికారంలోకి వచ్చి తప్పులు చేస్తే విమర్శించటం సబబు అని దాసరి కి పరోక్షంగా సూచించారు. అప్పటి ఎన్టీఆర్ విధానాలను విమర్శిస్తూ గండికోట రహస్యం అనే సినిమాను తీసారని ప్రస్దావిస్తే..అప్పటికే తెలుగుదేశం పాలన జరిగిందని, విమర్శించటం సబబు అన్నట్లు చెప్పుకొచ్చారు. ఇక మీ పార్టీ పోసాని రాజు గారి చేపల చెరువు అంటూ సినిమా తీస్తున్నారు కదా అని ప్రశ్నిస్తే..అందులో మెసేజ్ ఉంటుందని చెప్పుకొచ్చారు. మొత్తానికి ఆయన విశ్లేషకులంతా ఫ్లాప్ అంటున్నారంటూ మేస్త్రిని తేల్చేసారు.