హైదరాబాద్: బీసీ నేతలను ప్రజారాజ్యం అధినేత చిరంజీవి కోవర్టులుగా ముద్రవేయడాన్ని టీడీపీ కార్యదర్శి అరవింద్ కుమార్ గౌడ్ తప్పుబట్టారు. ప్రజారాజ్యం నుంచి టీడీపీలోకి వెళ్లేవారంతా కోవర్టులేనని చిరంజీవి వ్యాఖ్యానించటం సరికాదన్నారు. టీడీపీ నేతలంతా కోవర్టులే అయితే పీఆర్పీలో ఉన్న కళా వెంకట్రావు, తమ్మినేని తదితరులంతా అంతేనని అనుకోవాల్సి వస్తుందన్నారు. చిరంజీవి తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయానికి చిరునామా టీడీపీయేనని దీనిపై పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని అన్నారు.