పివిని అవమానించిన వైఎస్: ఎన్టీఆర్

శ్రీకాకుళం జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్ పర్యటన మూడవ రోజు సాగుతోంది. శనివారం శ్రీకాకుళం, ఆముదాలవలస, హెచ్చర్ల, రాజం, పాలకొండలలో పర్యటన సాగుతుంది. ఉరకలెత్తిన యువరక్తం...ఉప్పొంగిన ఉత్సహం...వెల్లువెత్తిన ప్రజాభిమానం...పలకరించిన అభిమానుల సందడి వెరసి ఒక ఉత్సవంలా జూనియర్ ఎన్‌టిఆర్ పర్యటన సాగుతోంది.
ఈ రోజు పర్యటనలో భాగంగా చిలక పాలెం జంక్షన్ రోడ్ షోలో మాట్లాడుతూ కొందరు నేతలు మాది సామాజిక న్యాయం గల పార్టీ అని చెప్పుకుంటున్నారు. ఏం..టిడిపిలో సామాజిక న్యాయం లేదా మహిళలకు తెలుగుదేశంపార్టీ ప్రత్యేక స్థానం కల్పించి, ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. అది సామాజిక న్యాయం కాదా...రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం పేద ప్రజలను ఆదుకోలేదా...అది సామాజిక న్యాయం కాదా...
కులమత బేధాలు లేకుండా అన్ని వర్గాల వారికి పార్టీలో సీట్లు ఇచ్చింది అది సామాజిక న్యాయం కాదా...అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలు నీరు కావాలని అంటుంటే కాంగ్రెస్ ప్రభుత్వం బీరును పొర్లిస్తుంది. నాడు టిడిపి జన్మభూమి అంటే నేడు కాంగ్రెస్ భూములను దోచుకుంటుంది. అంతెందుకు శంషాబాద్ విమానాశ్రయానికి స్వర్గీయ ఎన్టీ రామారావు పేరు పెట్టమని రాష్ట్ర ప్రజలు కోరితే 'రాజీవ్' పేరు పెట్టారు. ప్రధానమంత్రిగా చేసిన పీ.వి.నరసింహరావు పేరు ఎందుకు పెట్టలేదని జూ.ఎన్టీఆర్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications