టీమిండియా మాజీక్రికెటర్ రిటైర్మెంట్..! జగన్ ఎమోషనల్ ట్వీట్..!
ఏపీకి చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్, భారత జట్టు మాజీ ప్లేయర్ కూడా అయిన కేఎస్ భరత్ తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దేశవాళీ క్రికెట్ లో రాణించినా, అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం ఒత్తిడిని తట్టుకోలేక అవకాశాలు పొందడంలో విఫలమైన భరత్.. ఇక కొనసాగడం కష్టమని భావించి గుడ్ బై చెప్పేశాడు. దీంతో కేఎస్ భరత్ నిర్ణయాన్ని గౌరవిస్తూ, అతనికి రాష్ట్రానికి చెందిన చాలా మంది శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇదే కోవలో మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా స్పందించారు.
కేఎస్ భరత్ (KS Bharat) రిటైర్మెంట్ నేపథ్యంలో వైఎస్ జగన్ (YS jagan) ఇవాళ ఎక్స్ లో ఓ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన.. అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించి కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న కె.ఎస్. భరత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తుకు ఆల్ ది బెస్ట్! అని కూడా చెప్పారు. గతంలో టీమిండియాలో అవకాశం తెచ్చుకుని మెరుపులు మెరిపిస్తున్న సందర్భంలో భరత్ తనను కలిసిన ఫొ టోను కూడా జగన్ ట్వీట్ చేశారు.

రెండు రోజుల క్రితం క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన కేఎస్ భరత్.. తన భవిష్యత్ కార్యాచరణ వెల్లడించాడు. భవిష్యత్తులో కోచింగ్, మెంటార్షిప్ ద్వారా యువ ఆటగాళ్లకు మార్గదర్శనం చేస్తానని కేఎస్ భరత్ తెలిపాడు. 2023లో ఆస్ట్రేలియాతో టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన భరత్.. మొత్తం 7 టెస్టులు ఆడాడు. ఇందులో 221 పరుగులు మాత్రమే చేశాడు. వికెట్ కీపర్ గా మాత్రం 18 మందిని అవుట్ చేశాడు. అలాగే ఓ స్టంపింగ్ కూడా చేశాడు. దేశవాళీ క్రికెట్లో మాత్రం 11 సెంచరీలు, 34 అర్ధసెంచరీలు సాధించిన రికార్డు కేఎస్ భరత్ కు ఉంది.













Click it and Unblock the Notifications