లిక్కర్ కేసులో జగన్ కు నోటీసులు, అనూహ్య మలుపు..!?
ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు. లిక్కర్ కేసులో ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యారు. పలువురిని సెట్ విచారణ చేసింది. ఈ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలుతో ఈడీ సైతం నోటీసులు జారీ చేసి విచారణ కొనసాగిస్తోంది. లిక్కర్ కేసులో నిందితుల ఇళ్లల్లోనూ సోదాలు జరిగాయి. ఇక, ఇప్పుడు నేరుగా మాజీ సీఎం జగన్ కు నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్దం అయినట్లు తెలుస్తోంది. విచారణలో ఆయన సన్నిహితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈడీ నోటీసులు ఇవ్వటానికి సిద్దమైనట్లు సమాచారం.
ఏపీ మద్యం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణ కీలక దశకు చేరింది. ఈ కేసులో అంతిమంగా ఎవరు లబ్ది పొందారనే అంశం తేల్చేందుకు సిద్దమయ్యారు. అందులో భాగంగా మాజీ సీఎం జగన్ ను విచారణ చేసేందుకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఈడీ అనేక మందిని విచారణ చేసింది. వారి వాంగ్మూలాలు నమోదు చేసారు. నిందితులు చెప్పిన వివరాలు.. దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా ఈ కేసులో విచారణ పూర్తి చేయాలని ఈడీ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం .అందులో భాగంగా చివరిగా ఈ కేసులో మాజీ సీఎం జగన్ ను విచారణ చేయాలని ఈడీ అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ కేసు విచారణ చేసిన సిట్ అధికారులు ఇప్పటికే 350 పేజీల ఛార్జ్ షీటు దాఖలు చేసింది. అందులో జగన్ అంతిమ లబ్ది దారుగా సిట్ పేర్కొన్నట్లుగా వార్తలు వచ్చాయి.

అంతిమ లబ్దిదారుని తేల్చేలా కసరత్తు
కాగా, ఈ కేసులో ఇప్పటికే ఈడీ పలువురిని విచారణ చేసింది. సిట్ నుంచి వివరాలను తీసుకున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నిందితుల ఆస్తులను కూడా సీజ్ చేశారు. రాజ్ కసిరెడ్డి, వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, భారతీ సిమెంట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి నివాసాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, తిరుపతిలోని వారి నివాసాలతోపాటు కార్యాలయాల్లో ఈ తనిఖీలు ఈడీ అధికారులు చేపట్టారు. కాగా.. ఈ సోదాల సమయంలో సేకరించిన సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు తదుపరి చర్యలకు సిద్దం అవుతున్నారు. అందులో భాగంగా ఇప్పుడు మాజీ సీఎం జగన్ కు నోటీసులు ఇచ్చేందుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. జగన్ కు ఈడీ నోటీసులు జారీ చేస్తే.. మాజీ సీఎం స్పందన.. తరువాతి పరిణామాల పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.













Click it and Unblock the Notifications