21 న హైదరాబాద్ లో మెగా సబ: చిరు

ప్రజారాజ్యం జిల్లా కన్వీనర్లు, సంయుక్త కన్వీనర్లతో ఓ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ... బహిరంగ సబపే విజయవంతం చేసేందుకు వీరు నిర్వహించాల్సిన బాధ్యతలపై చర్చించనున్నట్లు చెప్పారు. సబ నిర్వహణ తర్వాతే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేస్తామన్నారు. అన్ని కోణాలను పరిశీలించిన తర్వాత అభ్యర్థులను ఖరారు చేస్తామని, కసరత్తు ఇంకా కొనసాగుతోందని చెప్పారు. కృష్ణా జిల్లాలో సోమవారం(16వ తేదీ) నుంచి తాను నిర్వహించనున్న పర్యటన ఒకరోజు వాయిదా పడిందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఒకే గుర్తుతో పోటీ చేస్తామని చిరంజీవి స్పష్టంచేశారు. వికలాంగులకు ఎన్ని టిక్కెట్లు కేటాయిస్తారనే ప్రశ్నకు చిరంజీవి సమాధానమిస్తూ-వారు ఆత్మగౌరవంగా తలెత్తుకు తిరిగేలా చేస్తామని హామీఇచ్చారు. ఈ సందర్భంగా కాన్షీరాం 75వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి చిరంజీవి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. కాన్షీ శిష్యులు అనేక మంది ప్రజారాజ్యం పార్టీలో ఉన్నారని చిరంజీవి పేర్కొన్నారు. కాన్షీ మనువడు ప్రకాష్ వస్తానని చెప్పారని, అనివార్య కారణాల వల్ల రాలేకపోయారని తెలిపారు.












Click it and Unblock the Notifications