ప్రకాశం: బాలకృష్ణ సోదరి పురంధేశ్వరిపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ప్రకాశం జిల్లా వేటపాలెంలో నిర్వహించిన రోడ్ షోలో పురంధేశ్వరి చేనేత కార్మికుల సమస్యలను పట్టించుకోలేదని బాలకృష్ణ ఘాటుగా విమర్శించారు. అలాగే చేనేత కార్మికులు లేఖలు రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నా పురంధేశ్వరి, ఆర్థిక మంత్రి రోశయ్య వారి సమస్యలను పట్టించుకోవటంలేదన్నారు. ఇత తన తండ్రి ఎన్టీఆర్ విగ్రహాలకు బాలకృష్ణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిస్తూ ముందుకెళ్తున్నారు. తెలుగుదేశం ప్రకటించిన మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ సాగుతున్నారు. ఉపన్యాసాల్లో ఎక్కువుగా కాంగ్రెస్ పార్టీని ఎ౦డగడుతున్నారు.