న్యూఢిల్లీ: ఆరోగ్య శ్రీని రద్దు చేయాలని ఎన్నికల కమీషన్‌ను తమ పార్టీ ఎప్పుడూ కోరలేదని, కేవలం తమ పార్టీపై బురద చల్లడానికే ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలుగు దేశం రాజ్యసభ సభ్యుడు ఎం వి మైసూరా రెడ్డి తేల్చి చెప్పారు. నిన్న జరిగిన మీడియా సమావేశంలో ఈ విషయం చెప్పారు. ఇక ఎన్నికల వేళ కావటంతో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలేవీ ఆరోగ్య శ్రీకి వ్యతిరేకంగా మాట్లాడడానికి ఇష్టపడడంలేదు. ఈ మేరకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ ఇటీవలే ఓ ప్రకటన చేసారు. తాజాగా తెలుగుదేశం ఇదే రూటులో ప్రయాణం పెట్టుకుంది. ఆరోగ్య శ్రీ తో పాటు, 104, 108 సేవలు ప్రభుత్వ కార్యక్రమాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం వాటిని కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసం వాడుకుంటున్నాయన్నాయని మైసూరా రెడ్డి ఆరోపించారు.