హైదరాబాద్: ప్రభుత్వ ప్రకటనలను వార్తల రూపంలో ప్రసారం చేస్తోందంటూ వైఎస్ జగన్ సారధ్యంలోని సాక్షి ఛానల్‌పై మహాకూటమి నేతలు ప్రధాన ఎన్నికల అధికారి ఐ.వి.సుబ్బారావుకు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ కుమారుడు జగన్ ఈ ఛానెల్ ద్వారా యదేచ్ఛగా కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. గతంలోనే పలుమార్లు ఈ విషయం ఈసీ దృష్టికి తీసుకువచ్చామని, దీనికి సంబంధించిన చర్యల విషయంలో జాప్యం జరుగుతోందని ఆ పార్టీ సీనియర్ నేత ఎర్రంనాయుడు అన్నారు. ఈసీ వెంటనే స్పందించి సాక్షి ఛానల్ తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవాలని ఆయన ఐ.వి.సుబ్బారావుకు వినతిపత్రం సమర్పించారు.