పులివెందులలో నిఘా కెమెరాలు

అనంతరం పులివెందులలో విలేఖరులతో మాట్లాడుతూ...ఇక్కడ ఎన్నికలు జరిగే తీరుపై గ్రామీణ ఓటర్లనుంచి సమాచారం సేకరించినట్లు తెలిపారు. మురారిచింతల, కోమన్నూతల , ఎగువపల్లె, దిగువపల్లె, గ్రామాలను చుట్టి వచ్చామని, పులివెందులలో ఎన్నికలు ఏకపక్షంగా సాగుతాయని ప్రజలు వివరించారని పేర్కొన్నారు.
ఈసారి పోలింగ్ నిష్పక్ష పాతంగా జరిగేలా ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కె.జె.రావు వెల్లడించారు. అందువల్ల ఓటర్లు నిర్భయంగా ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవచ్చునని భరోసా ఇచ్చారు. వేదిక తరఫున పోలింగ్ నాడు పులివెందులలో ఉంటానని వివరించారు. కమిటీ సభ్యులు లక్ష్మణ్ రావు, వెంకటేశ్వరరావు, శ్రీరాములు, సెంట్రల్ యూనివర్శిటీ ఫ్రొఫెసర్ చిన్నయ్యసూరి తదితరులు ఆయన వెంట పర్యటనలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications