వైఎస్ కు మంత్రి శాపనార్ధాలు
హైదరాబాద్: 'ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేకుండా పోయే రోజులు దగ్గరే ఉన్నాయి. 40-45 కుటుంబాలను బాధాకరమైన పరిస్థితుల్లోకి నెట్టేసిన రాజశేఖర్‌రెడ్డి అతి త్వరలో ఆ క్షోభను అనుభవిస్తాడు' అని మంత్రి గొల్లపల్లి సూర్యారావు ముఖ్యమంత్రి వైఎస్‌పై నిప్పులు చెరిగారు. తూర్పుగోదావరి జిల్లా ఇసుక కుంభకోణంలో జరిగిన అక్రమాలపై ప్రశ్నించినందుకు, ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించినందుకు కక్షగట్టి తనకు వైఎస్ టిక్కెట్ ఇవ్వలేదని ఆరోపించారు. ఆయన సోమవారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక కుంభకోణంపై అక్కడి జిల్లా పరిషత్ సమావేశంలో తాను ప్రశ్నించడం వారికి నచ్చలేదని అన్నారు. అప్పుడే తనపై ఏదైనాచర్య తీసుకుని ఉంటే సంతోషపడేవాడినని చెప్పారు. 'ప్రభుత్వంలో ప్రవాహంలా పారుతున్న అవినీతికి నీవు కాలు అడ్డుపెడతావా? అవినీతి కాల్వను గట్టుతో పూడుస్తావా? అని ఆ రోజే అడిగి ఉంటే..బయటకు పంపేసి ఉంటే సరిపోయేది కదా' అని అన్నారు.
ఇసుక సీనరేజ్ ద్వారా జిల్లాకు రావాల్సిన ఆదాయాన్ని కాంట్రాక్టర్ కోసం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జెసి దివాకర్ రెడ్డి, జిల్లాలో ఇసుక సిండికేట్ అవుతున్న నియోజవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మరో మంత్రి రూ.8 కోట్లు రాయితీ(కన్సెషన్)ఇవ్వడం గురించి తాను ప్రశ్నించడం వారిని బాధించినట్లుందని గొల్లపల్లి పేర్కొన్నారు. ఆ మంత్రులు, ఇసుక కుంభకోణంలో భాగస్వాములైన జిల్లాకు చెందినవారి కుట్ర కారణంగానే తనకు టిక్కెట్ రాలేదని భావిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ తనకు టిక్కెట్ రాకుండా చేయగలిగిగారే గానీ, ప్రజాజీవితం, ప్రజా వేదిక నుంచి నెట్టేయలేరని హెచ్చరించారు. ప్రజల సమస్యలను అవగతం చేసుకొని వారికోసం పోరాడకుండా తమను అడ్డుకోలేరని పేర్కొన్నారు. అందరికి సర్దుబాటు చేశారని, సర్దుబాటు చేయనివారిలో అధికశాతం దళితవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలే ఉన్నారని అన్నారు. తనతోపాటు నెలవల సుబ్రమణ్యం, కోనేరు రంగారావు, దారా సాంబయ్య, మారెప్పవంటి వారున్నారని వివరించారు.
రాజశేఖరరెడ్డిది దళిత నాయకుల ఎదుగుదలను అంగీకరించే మనస్తత్వం కాదని దుయ్యబట్టారు. ఒకే మాటమీద ముఖ్యమంత్రి వెన్నంటి ఉన్న వర్గాలెవరైనా ఉన్నారా.. అంటే అది ఎస్సీ కులాలకు చెందిన ఎమ్మెల్యేనని, ఆయన వారికే అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. ఆ రోజుల్లో దామోదరం సంజీవయ్య లాంటి త్యాగమూర్తులు రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ తరఫున పాలించారని గుర్తు చేశారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన బాలయోగిలాంటి నాయకుడిని తెలుగుదేశం పార్టీ దేశంలో అత్యున్నతమైన పార్లమెంట్ స్పీకర్‌ను చేసిందని అభినందించారు. ఈ ప్రభుత్వంలో తమలాంటి దళిత నేతలు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నామని, తమ జీవితాలతో రాజశేఖర్‌రెడ్డి చెలగాటమాడుకున్నారని ఆరోపించారు.
ఆయన ఎక్కడికి వెళ్లినా ఎస్సీ వర్గీకరణ పాట పాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎనిమిదన్నర కోట్ల మంది ప్రజలకు ప్రతినిధి ఉండి.. ఇలా వర్గీకరణ అంటూ వెళ్తే ఎలా? అని ప్రశ్నించారు. దళితుల్లో అసమానతలు ఎక్కడున్నాయి, వాటిని తొలగించేందుకు ఏం చేయాలి, అసలు అవి ఆర్థిక అసమానతలా? సామాజిక అసమానతలా? వీటన్నింటి గురించి ముఖ్యమంత్రి ఎప్పుడూ తమతో చర్చించలేదని, ఎప్పుడూ వర్గీకరణ అంటున్నారని ఆరోపించారు. దాన్ని మొదటినుంచీ తాను వ్యతిరేకించానని, తనకు టిక్కెట్ ఇవ్వకపోవడానికి అదో కారణమని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి అవినీతి పరుడని రాష్ట్రమంతా కోడై కూస్తున్నా..ప్రభుత్వం అవినీతికి నిలియమైపోయిందని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినా తాము ముఖ్యమంత్రి, ప్రభుత్వ పక్షాన ఉండి వాటిని ఎదుర్కోడానికి, అది తప్పని నిరూపించేందుకే ప్రయత్నించామని గొల్లపల్లి చెప్పారు. ఏనాడూ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడలేదని అన్నారు. కాంగ్రెస్‌లోనే ఉండి పోరాడతారా? అన్న ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ..ఆ పార్టీలోనే ఉండి పోరాడాల్సిన అవసరం లేదని, చాలా వేదికలున్నాయని పేర్కొన్నారు. 28 ఏళ్లుగా తనకు సహకరిస్తున్న శ్రేయోభిలాషులు, కార్యకర్తల అభిప్రాయం మేరకు భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.
-
కాంగ్రెస్‌కు పాకిస్తాన్ సాయం? మలుపు తిరిగిన అస్సాం రాజకీయం -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
CSK vs RCB: ఓటమికి కారణమెవరంటే ? నిజాయితీగా చెప్పేసిన రుతురాజ్..! -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
పొంచి ఉన్న తుఫాన్ ముప్పు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
నరసాపురం To అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరే వేళ ఊహించని ట్విస్ట్..!!












Click it and Unblock the Notifications