న్యూఢిల్లీ: రానున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రస్తుత ప్రధానమంత్రి మన్మోహన్ సింగే తమ ప్రధాని అభ్యర్థి అని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రకటించారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక విడుదల సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇతర రాజకీయపక్షాల ప్రధాని అభ్యర్థులు మన్మోహన్ సింగ్‌కు సాటిరారని పేర్కొన్నారు. యూపీఏ సర్కారు గత ఐదేళ్లలో సాధించిన ప్రగతిపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.