కాంగ్రెస్ లో నరేంద్ర పార్టీ విలీనం
హైదరాబాద్: నరేంద్ర నాయకత్వంలోని తెలంగాణ రాష్టస్రమితి (ఎన్) పార్టీ నేడు కాంగ్రెస్ లో విలీనం అయింది. శుక్రవారం ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ (ఎన్) పార్టీ అధినేత ఆలె నరేంద్ర విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. గత ఎన్నికల్లో నరేంద్ర టీఆర్‌ఎస్ పార్టీ తరఫున మెదక్ లోక్‌సభ స్ధానానికి ఎన్నికయ్యారు. కేసీఆర్‌తో విభేధాలు వచ్చి ఆయన పార్టీ నుంచి బయటికి వచ్చి టీఆర్‌ఎస్ (ఎన్)ను సొంత పార్టీ పెట్టుకున్నారు. అయితే అణుఒప్పందం విషయంలో యూపీఏ ప్రభుత్వానికి విశ్వాసపరీక్షలో అండగా నిలిచారు. నరేంద్ర కాంగ్రెస్ నుంచి మెదక్ టికెట్ ఆశించారు. కాని అధిష్ఠానం ఆయనకు టికెట్ కేటాయించలేదు. ఆయనకు రాజ్యసభ స్ధానం కేటాయిస్తామని కాంగ్రెస్ అధిష్టానవర్గం హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. సీఎంను కలిసిన తర్వాత నరేంద్ర తన పార్టీని నేడు లాంచనంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు.












Click it and Unblock the Notifications