రోడ్డు ప్రమాదంలో 24 మంది మృతి
చండీగఢ్: హిమాచల్ ప్రదేశ్-పంజాబ్ సరిహద్దులో జరిగిన ఓ రోడ్డుప్రమాదంలో 24 మంది మృతి చెందగా 75మంది వరకు గాయపడ్డారు. పంజాబ్‌లోని ఆనందపూర్ సాహెబ్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. మచ్చివారా గ్రామానికి చెందిన భక్తులు హిమాచల్‌ప్రదేశ్‌లోని నైనాదేవి మందిరంలో జరుగుతున్న ఉత్సవాలకు వెళ్లారు. అక్కడ మొక్కులు చెల్లించుకున్న తరువాత ఓ ట్రక్కులో తిరిగివస్తుండగా ఆనందపూర్ సాహెబ్ వద్ద వాహనం అదుపుతప్పి బోల్తాపడింది.
ట్రక్కులో మహిళలు, పిల్లలే అధికంగా ఉన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అందులో విషమంగా ఉన్న ఆరుగురిని ఘటనాస్థలానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న చండీగఢ్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.












Click it and Unblock the Notifications