డ్యూయెట్లు కాదు: చిరుపై వైయస్

YS Rajasekhar Reddy
ఆదిలాబాద్‌: రాజకీయమంటే ఎవరో రాసిన డైలాగులు చెబుతూ, హీరోయిన్లతో డ్యూయెట్లు పాడుతూ వేసే రెండుగంటల ఆట కాదని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అన్నారు. ఎన్నికల జైత్రయాత్రలో భాగంగా మంగళవారం ఆదిలాబాద్‌లో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. అధికారదాహంకోసం భావసారూప్యత లేని టీడీపీ, తెరాస, వామపక్షాలు జట్టు కట్టాయని అందుకే ఒకరితో ఒకరికి పొసగటం లేదని ఆయన అన్నారు. మహాకూటమిలోని పార్టీలకు ఉమ్మడి ఆలోచన లేదు, ఉమ్మడి ప్రణాళిక లేదని, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తేలంగాణ రాష్ట్రం కావాలంటుంది, సిపిఎం వద్దంటుందని, అటువంటి వారిని గెలిపిస్తే ప్రజలకు వారు ఏమీ చేయలేరని ఆయన అన్నారు.

ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి ప్రాజెక్టుల వద్దంటున్నారని, ప్రాజెక్టులు లేకుండా రైతులకు నీళ్లు ఎలా ఇస్తారని ఆయన అన్నారు. ఒక సిద్ధాంతం లేనివారు అధికారంలోకి వస్తే ఏమవుతుందో ఆలోచించాలని ఆయన ప్రజలను ఉద్దేశించి అన్నారు. అధికారంకోసం గడ్డి కరుస్తున్న మహాకూటమిని తుంగలో తొక్కాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. దుర్మార్గుడైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును నమ్మవద్దన్నారు. ప్రజాసంక్షేమం కోసం పనిచేస్తున్న కాంగ్రెస్‌కు పట్టంగ ట్టాలని పిలుపు ఇచ్చారు. అనంతరం ఆయన హెలికాప్టర్‌లో ఉట్నూరు వెళ్లారు. ఆ తరువాత ఇచ్చోడ, బజార్‌హత్నూర్‌, బోథ్‌, నేరడిగొండలలో రోడ్‌షోల్లో పాల్గొంటున్నారు. రాత్రికి నిర్మల్‌లో బహిరంగసభలో పాల్గొని అక్కడే బస చేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+