హైదరాబాద్: మహాకూటమి పొత్తులు ఓ కొలిక్కి వచ్చినా సీపీఎంతో ఒకటి రెండు స్థానాల విషయంలో తేడాలు రావటంతో బుధవారం మధ్యాహ్నం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వారితో సమావేశం కానున్నారు. గత అర్థరాత్రివరకు కూడా సీపీఎం బృందం బాబుతో చర్చలు జరిపింది. అయినా పూర్తి స్పష్టత రానందున ఈరోజు తిరగి భేటీ నిర్ణయించారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా డోర్నకల్, ములుగు స్థానాలు సీపీఎంకు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ప్రచారంపై మహాకూటమి అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చిస్తారు.