వైయస్! ఇడుపులపాయ ఇవ్వండి: బాలకృష్ణ

రాయలు ఏలిన రతనాల సీమ అంటూ ఆయన ప్రశసించారు. కాంగ్రెసును నమ్మి మోసపోవద్దని ఆయన ప్రజలకు పిలుపు నిచ్చారు. కాంగ్రెసు నోట్లకు ఓట్లు అమ్ముకోవద్దని ఆయన సలహా ఇచ్చారు. కాంగ్రెసు అవినీతికి చిరునామాగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. తమ పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీరామారావు తెలుగుగంగ ప్రాజెక్టు చేపట్టి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించారని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఐటి అభివృద్ధి చెందిందని, యువతకు ఇతోధికంగా ఉపాధి లభించిందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications