పుట్టి మునిగి 11 మంది మృతి
నల్గొండ: నల్గొండ జిల్లాలో పుట్టి మునిగి 11 మంది మృతి చెందగా 17 మంది గల్లంతయ్యారు. చందంపేట మండలం తెలదేవరపల్లి వద్ద శుక్రవారం ఈ సంఘటన జరిగింది. ఇక్కడికి సమీపంలోనే గట్టు వెంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. అక్కడ మొక్కు తీర్చుకునేందుకు గిరిజనులు పలువురు బయలుదేరారు. వాగుదాటి గుడికి వెళ్లాల్సి ఉండటంతో పుట్టి ఎక్కారు. అందులో ఎక్కువమంది ఎక్కటంతో బరువు ఎక్కువై దారిలో అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో అందరూ నీటిలో పడిపోయారు. దీంతో 11 మంది మృతి చెందగా 17 మంది గల్లంతయినట్లు అధికారులు తెలిపారు. రెవిన్యూశాఖ సహాయచర్యలు చేపట్టింది. పలువురి మృతదేహాలను బయటకు తీశారు.












Click it and Unblock the Notifications