జూబ్లిహిల్స్ లో 8 లక్షలు స్వాధీనం
హైదరాబాద్: ఎన్నికల్లో రాజకీయ నాయకులకు సినిమా వాళ్ళు డబ్బు సర్దడం మామూలే. రాజకీయాలకు సినిమాలకు విడదీయరాని బంధముంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెంబర్ 43లో ఓ వ్యక్తినుంచి 8 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల్లో డబ్బు పంపిణీ చేసేందుకు అనూప్ గెస్ట్ హౌస్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయని పోలీసులకు సమాచారం రావటంతో వారు దాడిచేసి సురేష్ అనే వ్యక్తినుంచి 8 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. తాను నిర్మాతనని అతను పోలీసులకు చెప్పినా అది వాస్తవం కాదని పోలీసులు అంటున్నారు. నిజానిజాలు తేలవలసి ఉంది.












Click it and Unblock the Notifications