కత్తులుతో కాదు..బాలయ్య

ప్రజాధనాన్ని కొల్లగొట్టి కూడబెట్టే కాంగ్రెస్ పార్టీని కూలదోసి, కూడు పెట్టే తెదేపాను అధికారంలోకి తీసుకురావాల్సిన సమయం వచ్చింది. తొడగొట్టి కాంగ్రెస్ పార్టీని తరమికొట్టండి అని బాలయ్య ప్రజలకు ఉద్బోదించారు. అవినీతి లేదని..సరసాదేవి సాక్షిగా చెప్పమనండి, మంత్రుల మీద ప్రమాణం చేసి చెప్పమనండి, కాంగ్రెస్ నేతల ఆత్మసాక్షిగా ఒట్టు వేయమనండి అంటూ ఘాటు విమర్శలు చేశారు.
అలాగే తన తండ్రి ఎన్టీఆర్ సిద్ధాంతాలను, తన బావ చంద్రబాబు ఆశయాలను ప్రజల ముందుకు తీసుకురావాడానికే జనంలోకి వచ్చానని తెలిపారు. సెజ్‌లు పేరుతో కాంగ్రెస్ సర్కారు ఈ ఐదేళ్లలో భారీ ఎత్తున దోపిడీకి పాల్పడిందన్నారు. పీకల్లోతు అవినీతిలో వైఎస్ సర్కారు కూరుకుపోయిందనడానికి డీపెప్, సత్యం, మైటాస్‌ల కుంభకోణాలే తార్కాణమని ఆయన విరుచుకుపడ్డారు.
పొట్టగొట్టే కాంగ్రెస్‌లో కావాలో, అన్నం పెట్టే టీడీపీ కావాలో నిర్ణయించుకోవాలన్నారు. కమలాపురం నియోజకవర్గంలో దొంగగా గుర్తింపు పొందిన వీరశివారెడ్డి, భూ బకాసురునిగా రాష్ట్రం కోడై కూస్తున్న వైఎస్ జగన్‌కు కడపలో టికెట్ ఇచ్చి కాంగ్రెస్ అవినీతిని ప్రోత్సహిస్తోందని బాలకృష్ణ అన్నారు. కడప జిల్లా కమలాపురంలో రాత్రి నిర్వహించిన రోడ్‌షోలో ఆయన ప్రసంగించారు.












Click it and Unblock the Notifications