పాలకొల్లు: ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ఈ రోజు పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ ఉదయం 11 గంటలకు పాలొకొల్లులో చిరు నామినేషన్ వేస్తున్నారు. అందునిమిత్తం అభిమానులు, కార్యకర్తలు పాలకొల్లుకు భారీగా తరలివస్తున్నారు. అనంతరం రేపు(శనివారం) తిరుపతిలో ఆయన రెండో నామినేషన్ దాఖలు చేస్తారు. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్ కడప పార్లమెంట్ స్థానానికి ఈ రోజే నామినేషన్ దాఖలు చేయనున్నారు.