పాలకొల్లులో చిరు భార్య సురేఖ పూజలు
పాలకొల్లు: ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి పర్యటన సందర్భంగా గురువారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు విచ్చేసిన ఆయన సతీమణి సురేఖ స్థానిక క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో పార్టీ విజయం కోరుతూ ప్రత్యేక పూజలు జరిపారు. సురేఖకు ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు.
అనంతరం ఆలయంలోని క్షీరారాముణ్ణి దర్శించి పూజలు చేశారు. అనంతరం స్థానిక సాయిబాబా ఆలయానికి వెళ్ళారు. అక్కడ కూడా సురేఖ తదితరులు పూజలు చేశారు. ఆలయం ఏర్పాటు చేసిన సహపంక్తి భోజన కార్యక్రమంలో పాల్గొని ప్రసాదం స్వీకరించారు. సురేఖ వెంట చిరంజీవి వదిన కొప్పినీడి వసంతలక్ష్మి, అల్లు కుటుంబ సభ్యులు, మహిళారాజ్యం నాయకులు, స్థానిక నాయకులు ఉన్నారు.












Click it and Unblock the Notifications