హైదరాబాద్: 108, 104 అంబులెన్సు వాహనాలపై రాజీవ్ గాంధీ బొమ్మను కొనసాగించేందుకు అనుమతి లభించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని గురువారం తన కార్యా లయంలో జరిగిన మీడియా సమా వేశంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధి కారి ఐవి సుబ్బారావు ధృవీకరించారు. ప్రభుత్వ పథకాలకు ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి, మంత్రుల చిత్రపటాలు కాకుండా ఖ్యాతిగాంచిన ప్రముఖుల ఫోటోలు ఉండవచ్చునని కేంద్ర ఎన్నికల సంఘం (సిఇసి) తన ఆదేశాలలో పేర్కొందన్నారు. ఈసీ తాజా ఆదేశాలతో తెల్ల స్టిక్కర్లను వెంటనే తొలగించాలని వైద్యశాఖకు ఆదేశాలు పంపామన్నారు.