హైదరాబాద్: కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సినీ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతోంది. ప్రస్తుతం పండ్లు, ఇతర తేలికపాటి ఆహారం తీసుకుంటున్నారు. ఎన్టీఆర్‌కి మరింత విశ్రాంతి అవసరమని కిమ్స్ వైద్యులు శ్రీనివాస్ తెలిపారు. గురువారం ఆయనను ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు తరలించారు. ఫిజియోథెరపీ చేయడంతో ఎన్టీఆర్ గురువారం కొంత ఉల్లాసంగా గడిపారు. జూనియర్ ఎన్టీఆర్‌ను గురువారం సినీ నటులు కోట శ్రీనివాస్‌రావు, నర్సింగ్, బెనర్జీ, తదితరులు పరామర్శించారు. తన మనవడి లాంటి జూనియర్ ఎన్టీఆర్‌తో మంచి అనుబంధం ఉందని, ఆయన సేవలు రాష్ట్ర ప్రజలకు ఎంతో అవసరమని కోట శ్రీనివాస్‌రావు ఈ సందర్భంగా కన్నీటి పర్యంతమయ్యారు.