కాంగ్రెస్‌ను బొందపెట్టండి: కేసీఆర్

'ఎన్నికల తరువాత కేంద్రంలో ఏర్పడేది సంకీర్ణ ప్రభుత్వమే...ఆ తరువాత తెలంగాణను ఎవరూ ఆపలేరు...ఈ అవకాశాన్ని జారవిడువద్దు... మీరిచ్చే ఓటు శక్తితో ఢిల్లీకి వెళ్లి రాష్ట్రం సాధించుకుందాం... ఐదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ జీవనాన్ని విధ్వంసం చేసింది. నక్సలైట్లను శాంతి చర్చలకు పిలిచి 80మందిని రాజశేఖర్‌రెడ్డి కాల్చి, మాడ్చుకు తిన్నాడు' అంటూ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై, ముఖ్యమంత్రిపై నిప్పులు కక్కారు.
'2004 ఎన్నికల్లో సోనియా చిలుక పలుకులు పలికింది. తెలంగాణ ప్రజల మనసులో ఏముందో తెలుసునంది. ఐదేళ్లూ ఆమె మనసులో ఏముందో చెప్పలేదు. మొన్న మనసులో మాట 'జై ఆంధ్రప్రదేశ్' అంటూ బయట పెట్టింది' అని విమర్శించారు. జలయజ్ఞం ద్వారా తెలంగాణలో ఒక్క ఎకరానికి కూడా అదనంగా నీరు పారలేదని, టీవి స్క్రీన్ల మీద మాత్రమే జలయజ్ఞం కనపిస్తున్నదని విమర్శించారు.












Click it and Unblock the Notifications