ఎన్టీఆర్ బతికుంటే బాగుండేది: పవన్

Pawan Kalyan
విశాఖపట్నం: బడుగు, బ లహీన వర్గాల సంక్షేమం కోసం తెలుగుదేశం పా ర్టీని స్థాపించిన మహనీయుడు ఎన్టీ రామారావు బతికుంటే అన్న చిరంజీవి ఇప్పుడు పార్టీని పెట్టాల్సిన అవసరమే ఉండేది కాదని యువరాజ్యం అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలోని ఎన్టీఆర్‌ మినీస్టేడియంలో గురువారం బహిరంగ సభలో ఆయన మా ట్లాడుతూ ఎన్టీఆర్‌ అంటే తమకెంతో గౌరవమని, అయితే ఆ మహనీయుడు నినదించిన ఆత్మగౌరవం నినాదం మధ్యలోనే ఆగిపోయిందన్నారు.

ఎన్టీఆర్‌ బ్యాంకు అక్కౌంట్‌లోని రూ.70 లక్షల డబ్బును స్తంభింపజేసిన దౌర్భాగ్యపు వ్యక్తిత్వం గల నాయకులు నేడు ఆయన ఫొటో పెట్టుకుని ప్రచారం చేస్తూ మళ్లీ ప్రజలను మభ్యపెడుతున్నారని పవన్‌ కళ్యాణ్‌ తీవ్రంగా విమర్శించారు. నిరుపేదల అభ్యున్నతి, ప్రజా సమస్యల గు రించి ఆలోచించిన ఎన్టీఆర్‌ వంటి అగ్రనేతలే నందువల్లనే అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేశారన్నారు.

కేవలం ఓట్లు, అధికారం లక్ష్యంగా మాత్రమే పీఆర్పీ అవిర్భవించలేదన్నారు. రెండు రూపాయలకు కిలో నూకలు ఇస్తున్నందునే వంద రూపాయలకు నిత్యావసర సరుకులు పథకం ప్రకటించామన్నారు. గోదావరి బేసిన్‌లో లభ్యమయ్యే సహజ వాయువును బహుళజాతి కంపెనీలకు చంద్రబాబు విక్రయించారని, మన ప్రకృతి సంపద మనకే దక్కాలన్న నినాదంతో వంద రూపాయలకే వంట గ్యాస్‌ పథకం ప్రకటించామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+