జయసుధపై పోలీసు కేసు

నామాలగుండు ప్రాంతంలో ఏర్పాటు చేసిన పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం కొద్ది దూరంలో ఉన్న చౌరస్తాలో పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు. దీనితో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రజలు పోలీసు కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. స్థానికులు కొందరు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి దృష్టికి కూడా తీసుకెవెళ్లారు. పోలీసులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు నామాలగుండుకు వచ్చి పరిస్థితిని పరిశీలించారు. జయసుధ ప్రారంభించిన పార్టీ కార్యాలయానికి అనుమతి లేదన్న విషయాన్ని గుర్తించారు.
పార్టీ జెండా ఆవిష్కరణ సమయంలో ప్రజల జీవనానికి ఆటంకం కలిగించిన సంఘటనను పరిగణలోకి తీసుకున్నారు. ఎన్నికల నియామవళిని ఉల్లంఘించారని పేర్కొంటూ, అభ్యర్థిపై కేసు నమో దు చేయాలని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి స్థానిక పోలీసులను ఆదేశించారు. చిలకలగూడ పోలీసులు జయసుధపై కేసు నమోదు చేసి, పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జెండాలు, బ్యానర్లను స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications