వైఎస్,డిఎస్ ఢీ : వీహెచ్
హైదరాబాదు: ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో అంబర్ పేట దాదా, రౌడీ షీటర్ అంబర్ పేట శంకర్ ను చేర్చుకోవడంపై వివాదం చినికి చినికి గాలి వానలా మారుతోంది. అంబర్ పేట శంకర్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై పార్టీ సీనియర్ నేత వి హన్మంతరావు తీవ్రంగా మండిపడ్డారు. శంకర్‌ను చేర్చుకోవడం వల్ల వైఎస్ ఇమేజ్‌కు వచ్చిన నష్టమేమీ లేదని, అయితే పార్టీ ఇమేజ్ దెబ్బ తింటే మాత్రం సహించేది లేదని ఆయన వ్యాఖ్యానించారు. శంకర్‌ను పార్టీలోకి తీసుకోవడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని వైఎస్ ఇప్పటికైనా తెలుసుకోవాలని, ఆయనను చేర్చుకోవడంలో తప్పు జరిగిందని సీఎం అంగీకరించాలని వీహెచ్ డిమాండ్ చేశారు. పార్టీలో వైఎస్, డిఎస్ ల మధ్య విభేదాలు ఉన్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications