పులివెందుల: రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పులివెందుల కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలుచేశారు. నామినేషన్ పత్రాలలో ఆయన తన సొంత ఆస్తుల వివరాల్ని అఫిడవిట్‌లో తెలియపరిచారు. వాటి ప్రకారం ఆయన వద్ద 30-3-2009 నాటికి రూ.12,379 ల నగదు,ఆయన భార్య విజయమ్మ వద్ద రూ.31,069 నగదు, నాన్ బ్యాంకింగ్ ఫానాన్సియర్కంపెనీలు, ఫైనాన్స్ ఇన్సిస్టిట్యూషన్లు డిపాజిట్లు రూపంలో వై.యస్ పేరిట రూ.1,93,797 లు భార్య విజయమ్మ పేరట ఫిక్సిడ్ డిపాజిట్లు నలభై లక్షలు, ఇంకా ఇతర డిపాజిట్లు 4,54,663లు, సరస్వతి పవర్ ప్లాంట్ షేర్లు ఉన్నట్లు వెళ్ళడించారు. అలాగే తనకు కానీ, తన సతీమణికి కానీ ఎలాంటి వాహనాలు లేవని వైయస్ పేర్కొన్నారు. మొత్తానికి ఆయన తన ఆస్తుల విలువ కేవలం రూ.కోటీ 34 లక్షలేనని లెక్కచూపుతున్నారు.