హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఆరోగ్యం మెరుగైందని, రెండు మూడు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేయవచ్చని కిమ్స్ వైద్యులు వెల్లడించారు. అయితే కొద్దిరోజులపాటు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుదని పేర్కొన్నారు. ప్రస్తుతం జనరల్ వార్డులోనే ఉన్నప్పటికీ..ఇన్ ఫెక్షన్ సోకకుండా ఎవర్నీ లోపలకు అనుమతించటం లేదని తెలిపారు. శుక్రవారం ఎన్టీఆర్‌ను పరామర్శించేందుకు పలువురు సినీ ప్రముఖులు వచ్చారు. ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ ఎన్టీఆర్ తో ముచ్చటించి ఆ వివరాలను తన పత్రికలో ఇంటర్వ్యూగా ప్రముఖంగా ప్రచురించుకున్నారు.