పార్టీని వీడినవారిపై పవన్ గుర్రు
హైదరాబాద్: పార్టీని వీడిన వారిపై యువరాజ్యం అధినేత, ప్రజారాజ్యం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. పార్టీని వీడినవారందరూ స్వలాభం కోసమే వెళ్లిపోయారని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
టిక్కెట్ల పంపకంలో సామాజిక న్యాయం పాటించడం వల్ల కొందరికి టిక్కెట్లు ఇవ్వలేకపోయామని ఆయన అన్నారు. డబ్బులకు టిక్కెట్లు అమ్ముకున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. తమపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. ఒక లక్ష్యసాధనకు, మంచి సమాజం కోసం చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications