తెలంగాణ జాతీయాంశం కాదు: ప్రణబ్
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జాతీయాంశం కానందున ఎన్నికల ప్రణాళికలో చేర్చలేదని విదేశాంగ మంత్రి, కాంగ్రెసు సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. తెలంగాణపై తమ వైఖరిలో మార్పు లేదని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి కె. రోశయ్య కమిటీ తెలంగాణపై చేసే సిఫార్సులకు కాంగ్రెసు కట్టుబడి ఉంటుందని ఆయన స్ఫష్టం చేశారు. తెలంగాణపై ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన ప్రకటనే తమ వైఖరి అని ఆయన చెప్పారు.
యుపిఎలో చీలిక వచ్చిందనే వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. యుపిఎ నుంచి డిఎంకె ఒక్క పార్టీ మాత్రమే వెళ్లి పోయిందని ఆయన చెప్పారు. యుపిఎలో చీలిక వచ్చినట్లు మీడియా తప్పుడు వార్తలు రాస్తోందని ఆయన అన్నారు. సమాజ్ వాదీ పార్టీ, ఆర్జెడి వంటి పార్టీలతో సీట్ల సర్దుబాటులో సమస్యలు తలెత్తినప్పటికీ కూటమి మాత్రం చెదరదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications