చిక్కుల్లో డిఎస్: వ్యాఖ్యల తంటా

విషయ తీవ్రత దృష్ట్యా సీడీలను ఈసీ బుధవారమే పరిశీలించే అవకాశం ఉంది. సుబ్బారావు నుంచి వెళ్లిన నివేదిక ప్రకారం చూస్తే డీఎస్‌కు తప్పనిసరిగా నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆయన వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని ఈసీ భావిస్తే వరుణ్ గాంధీలాగే ఎన్నికల బరి నుంచి తప్పించాలని కాంగ్రెస్ పార్టీకి సూచించినా ఆశ్చర్యపోనవసరం లేదని కొందరు అధికారులు చెబుతున్నారు. డీఎస్ వ్యాఖ్యలపై సీడీని చూసి తన నివేదికను ఈసీకి పంపించానని సుబ్బారావు మీడియా ప్రతినిధులతో చెప్పారు.












Click it and Unblock the Notifications