డిఎస్ కు ఇసి నోటీసు

డీఎస్ మాటలు మతవిద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, ముస్లింల వైపు చూపితే చేతులు నరికేస్తామంటూ డీఎస్ ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా మాట్లాడారని భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు ఎన్.రామచంద్రరావు, వీహెచ్‌పీ రాష్ట్ర కార్యదర్శి జి.దుర్గయ్యలు వేర్వేరుగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుబ్బారావుకు 6వ తేదీన ఫిర్యాదుచేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై వరుణ్‌గాంధీపై నాసా ప్రయోగించారని, అదే తరహాలో మాట్లాడిన డీఎస్‌పై కూడా అదే చట్టం కింద కేసు నమోదుచేయాలని డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి నిజామాబాద్ జిల్లా అధికారుల నుంచి డీఎస్ మాట్లాడిన సీడీలను తెప్పించుకున్నారు. ఆ మరుసటి రోజే దాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. ఆ సీడీని పరిశీలించిన తర్వాత డీఎస్ వివరణ కోరుతూ ఈసీ గురువారం నోటీసులు జారీచేసింది.












Click it and Unblock the Notifications