కూతుళ్లతో తల్లి ఆత్మహత్య
కడప: కడప జిల్లా అట్లూరు మండలం వెంకటాపురం గ్రామంలో మహాలక్ష్మి అనే మహిళ తన ఇద్దరు కూతుళ్లకు పురుగుమందు తాగించి తాను కూడా తాగి ఆత్మహత్య చేసుకుంది. ప్రసన్న, కామేశ్వరి అనే ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందారు. తల్లి మహాలక్ష్మి కూడా మృతి చెందింది. వారి కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు, అప్పులు ఎక్కువగా ఉండటంతో బతుకుదెరువుకోసం మహాలక్ష్మి భర్త ఎల్లారెడ్డి రెండు నెలల క్రితం కువైట్ వెళ్లాడు. భర్త చేసిన అప్పులు తీర్చలేక ఆమె తన ఇద్దరు కూతుళ్లతో సహా ఆత్మహత్య చేసుకుంది.












Click it and Unblock the Notifications