హైదరాబాద్: "నన్ను కోవర్ట్ అంటున్నారు... అవును నేను కోవర్టునే" అని ప్రజారాజ్యం మాజీ నాయకుడు పరకాల ప్రభాకర్ అన్నారు. వారి సామాజిక న్యాయం ఓ ముసుగు అని, బూటకమని అన్నారు. వారు బీసీలకు 104మందికి టిక్కెట్లు ఇచ్చామని చెప్పుకుంటున్నారని, అయితే అందులో 38 మంది బీసీలే కాదని అవి బోగస్ అని అన్నారు. వారు టిక్కెట్లు ఇచ్చిన పలు స్థానాల్లో అభ్యర్థుల గురించి వారి స్థాయి గురించి ఆయన తెలిపారు. ప్రజారాజ్యం రైలింజన్ పట్టాలు తప్పిందని, అది అలాగే నడిస్తే యాక్సిడెంట్లు జరుగుతాయని ఆయన ఆన్నారు. ప్రజారాజ్యం బ్యాలెన్స్ షీట్ ఇంకా పూర్తి కాలేదని ఆయన అన్నారు.