ప్రేమపెళ్లికి నిరాకరణ: బాలిక ఆత్మహత్య

Subscribe to Oneindia Telugu

నెల్లూరు: ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో మనస్తాపానికి గురైన 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం తెల్లవారుజామున నెల్లూరు జిల్లాలో జరిగింది. నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలం మంగా నెల్లూరు గ్రామంలో ఆ విషాద సంఘటన చోటు చేసుకుంది. వై.విమల అనే 8వ తరగతి విద్యార్థిని తన గ్రామానికే చెందిన యువకుడిని ప్రేమించింది.

ఆ యువకుడితో పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో ఆమె బుధవారం తెల్లవారుజామున ఫ్యాన్ కు ఉరేసుకుని మరణించింది. ఆమె మైనర్ కావడంతో, ఆ బాలిక ప్రేమించిన యువకుడు మరో కులం కావడంతో పెద్దలు ఈ పెళ్లికి అంగీకరించలేదని తెలుస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

Please Wait while comments are loading...