అన్నామలై భవిష్యత్ పై పవన్ హింట్..! సంచలన ట్వీట్..!

తమిళనాడులో బీజేపీ రాజకీయాలపై విరక్తిగా ఉన్న పార్టీ సీనియర్ నేత అన్నామలై(Annamalai) ఆ పార్టీని వీడేందుకు సిద్దమువుతున్నారు. నిన్న ఆయన.. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ను కలిసి రాజీనామా కూడా సమర్పించినట్లు తెలుస్తోంది. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసి చర్చలు జరిపారు. త్వరలో అన్నామలై కొత్త పార్టీ పెట్టేందుకు సిద్దమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్జీయేలో బీజేపీ భాగస్వామి అయిన పవన్ కళ్యాణ్ (Pawan kalyan) అన్నామలైకు పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఓ ట్వీట్ చేశారు.

Vijay: సీఎంగా తొలి సభలోనే విజయ్ ఫైర్..! స్టాలిన్ కు వార్నింగ్..! బ్లాక్ కోటు వెనుక ?
Vijay: సీఎంగా తొలి సభలోనే విజయ్ ఫైర్..! స్టాలిన్ కు వార్నింగ్..! బ్లాక్ కోటు వెనుక ?

నాయకా, నా ప్రియ సోదరుడు అన్నామలైకు పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విషయాలపై మీ స్పష్టత, విధానాలపై మీ దృఢత్వం, ప్రజా సేవ పట్ల మీ అచంచలమైన అంకితభావం విస్తృతంగా ప్రశంసించబడ్డాయంటూ అన్నామలైకు చేసిన ట్వీట్ లో పవన్ తెలిపారు. మీరు ధైర్యంతో, స్పష్టమైన దృష్టితో, అంకితభావంతో దేశానికి సేవ చేస్తూనే ఉండాలని కోరుకుంటున్నట్లు పవన్ అన్నామలైకి చెప్పుకొచ్చారు.

Pawan Kalyan Backs Annamalai as BJP s Tamil Nadu Chief Hints at Resignation
మా పవన్ నే బెదిరిస్తారా ? తెలంగాణ పార్టీలపై చంద్రబాబు ఫైర్..!
మా పవన్ నే బెదిరిస్తారా ? తెలంగాణ పార్టీలపై చంద్రబాబు ఫైర్..!

మురుగ స్వామి మీకు మంచి ఆరోగ్యాన్ని, శక్తిని ప్రసాదించుగాక అన్నారు. భవిష్యత్తులో మీరు ఏ మార్గాన్ని ఎంచుకున్నా, సిద్ధులు జీవించిన ఈ పవిత్ర తమిళనాడు భూమికి, మన మాతృభూమి అయిన భారత్‌కు ఇదే ఉత్సాహంతో, నిజాయితీతో, అంకితభావంతో సేవ చేస్తూనే ఉండాలని కోరుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ ట్వీట్ లో వెల్లడించారు. అయితే ఇందులో భవిష్యత్తులో ఏ మార్గాన్ని ఎంచుకున్నా.. అంటూ పవన్ చేసిన వ్యాఖ్య అన్నామలై బీజేపీని వీడటం ఖాయమైందనే అర్దంలో ఉంది. దీంతో బీజేపీకి గుడ్ బై చెప్పినా తన సహకారం ఉంటుందని పవన్ సంకేతం ఇచ్చినట్లయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+