పార్టీ వీడకుంటే.. అన్నామలై కు బీజేపీ బంపరాఫర్- కీలక మలుపు..!!
అన్నామలై ను వదులుకునేందుకు బీజేపీ అధినాయకత్వం సిద్దంగా లేదు. ఎలాగైనా ఆయన పార్టీ లో కొనసాగే విధంగా బుజ్జగింపులు కొనసాగిస్తోంది. పార్టీకి రాజీనామా చేస్తూ ఇచ్చిన లేఖ పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ వేళ.. తొందర పాటు నిర్ణయాలు వద్దని సూచించినట్లు సమాచారం. కాగా.. రంగంలోకి దిగిన మోదీ- షా టీం ఇప్పటికే అన్నామలై చెబుతున్న సమస్యలకు పరిష్కారాలతో పాటుగా... భవిష్యత్ పైన కొత్త ఆఫర్లు ఇచ్చిన ట్లుగా తెలుస్తోంది. దీంతో.. అన్నామలై నిర్ణయం ఏంటనేది కీలకంగా మారుతోంది.
బీజేపీ నేత అన్నామలై పార్టీకి రాజీనామా ఎపిసోడ్ కొత్త మలుపు తీసుకుంది. అన్నామలై పార్టీ చీఫ్ కు తన రాజీనామా లేఖ ఇచ్చారు. తాజా ఎన్నికల్లో అన్నా డీఎంకేతో పొత్తు.. సీట్ల ఖరారు.. బీజేపీ ఆలోచనలు అన్నామలైకు నచ్చలేదు. పార్టీ బలం పెరిగే సమయంలో అన్నాడీఎంకేతో పొత్తు నష్టం చేసందనేది ఆయన వాదన. దీంతో.. సొంతంగా తన సంస్థ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా యాత్రకు అన్నామలై సిద్దమయ్యారు. తాజాగా బీజేపీ చీఫ్ తో పాటుగా... కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ సమయంలోనూ తన అభ్యంతరాలు.. ఆలోచనలను స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే, అన్నామలైను వదులుకోవటం ఇష్టం లేని బీజేపీ నాయకత్వం బుజ్జగింపులు ప్రారంభించింది. తమిళనాడు పార్టీ అధ్యక్షుడిని ఢిల్లీకి పిలిపించింది. ఇదే సమయంలో అన్నామలై చేయాలని భావిస్తున్న యాత్రను బీజేపీ బ్యానర్ పైనే మరింత భారీగా, మరింత శక్తిమంతంగా చేద్దాం.. దానికి ఎదురయ్యే అడ్డంకులను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

అన్నామలై మనసు మారేనా..?
కొత్త పార్టీ ప్రస్తావన లేకుండా... బీజేపీ జెండా మీదే రాజకీయ ప్రయాణం సాగించాలని సూచించారు. కాగా.. ఇప్పటికే మోదీ- షా టీంకు చెందిన కొందరు నేతలు మంత్రాంగం ప్రారంభించారు. పార్టీలో కొనసాగాలని... అన్నామలై నిర్ణయాలను పార్టీ గౌరవిస్తుందని హామీ ఇచ్చినట్లు సమాచారం. అదే సమయంలో పార్టీ రాజ్యసభ తో పాటుగా కేంద్ర మంత్రిగా ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, అన్నామలై మాత్రం ఈ ఆఫర్ల పైన సానుకూలంగా స్పందించలేదని చెబుతున్నారు. కాగా.. ప్రధాని మోదీతో అన్నామలై సమావేశం కావాలని భావిస్తున్నారు. మోదీతో భేటీ తరువాత అన్నామలై తన నిర్ణయం పైన స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే.. అన్నామలై మనసు మార్చుకుంటే మోదీతో భేటీ ఉంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. తమిళనాడులో అన్నామలై పార్టీలో చేరిన తరువాత బలం పెరిగింది. దీంతో.. అన్నామలై ను వదులకొనేందుకు సిద్దంగా లేని బీజేపీ నాయకత్వం ఎలాగైనా రాజీనామా నిర్ణయాన్ని మార్చుకునే విధంగా ప్రయత్నం చేస్తుంది. దీంతో.. అన్నామలై తన రాజీనామాకు కట్టుబడి ఉంటారా.. మార్చుకుంటారా అనేది ఆసక్తిగా మారుతోంది.













Click it and Unblock the Notifications