'వైఎస్, నీ తాత దిగొచ్చినా గెల్వలేవ్'

సీఎంలను దించటానికి వందల మందిని పొట్టన పెట్టుకున్న రాక్షసుడని దుమ్మెత్తిపోశారు. ప్రజలను రెచ్చగొట్టడమనేది వైఎస్ నైజమని దుయ్యబట్టారు. నీ కథ అయిపోయింది, నీ తాత, జేజమ్మ వచ్చినా, ఎన్ని వేషాలు వేసినా మహాకూటమి గెలుపును, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపలేవన్నారు. కనీస రాజ్యాంగ పరిజ్ఞానం లేని సీఎంను చూసి సిగ్గుపడుతున్నాని అన్నారు.
హైదరాబాద్‌లో విదేశీయులవలె బతకాలంటావ్, నీ కొడుకు బెంగుళూర్ లో విదేశీయుడిగా ఉన్నాడా? మద్రాసులో తెలుగు ప్రజలు విదేశీయుల్లా ఉన్నారా? అని ప్రశ్నించారు. చిన్న విద్యాసంస్థలను మింగి అక్రమాలకు పాల్పడుతున్న ఆంధ్ర విద్యా సంస్థలను మూపిస్తామన్నామే తప్ప అన్ని ఆంధ్ర విద్యా సంస్థలను మూసేస్తామనలేదని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల ప్రజలను తన ఒడిలో దాచుకున్న చరిత్ర హైదరాబాద్‌కు ఉందన్నారు. హైదరాబాద్ సెటిలర్లకు తాను రక్షణగా ఉంటానని, వారంతా నా ఆత్మీయులేనన్నారు. ఆంధ్ర, రాయలసీమల్లో రైతులకు కూడా బాధలుంటాయని తనకు తెలుసని, వారికి నీళ్లివ్వద్దని తాను ఎప్పుడూ చెప్పలేదన్నారు. అయితే ప్రాంతాల వారిగా దామాషా ప్రకారం కేటాయించాలని కోరామని ఆయన స్పష్టం చేశారు












Click it and Unblock the Notifications