తిరుపతి: ప్రజారాజ్యం పార్టీ వారు డబ్బు పంచుతున్నారని అధికార కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేయడంతో చిరంజీవి బస చేసిన తిరుపతిలోని కెన్సెన్ హోటల్ లో ఆయన గదిని పోలీసులు తనిఖీ చేయడానికి ప్రయత్నించారు. దీనిపై చిరంజీవి స్పందిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఖూనీ చేసిందని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అన్నారు. బుధవారం డ్వాక్రా మహిళలకు పీఆర్పీ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారని చిరంజీవి బస చేసిన కెన్సెస్ హోటల్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. దీనిపై చిరు మీడియాతో మాట్లాడుతూ, తిరుపతిలో అసాంఘిక శక్తులు మోహరించాయని అన్నారు. కాంగ్రెస్ నాయకులు కావాలనే గొడవ చేస్తున్నారని, ఈ చర్యపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. తాము ఎవరికీ డబ్బులు పంచడం లేదని ఆయన స్పష్టం చేశారు.