ఉప ప్రధానిగా అమిత్ షా? అప్పుడే స్వాగతిస్తూ సాయిరెడ్డి ట్వీట్..!

త్వరలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అంతకు ముందే కేంద్ర కేబినెట్ ప్రక్షాళన(Cabinet Reshuffle) ఉంటుందని ఇప్పటికీ ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. గతంలోనూ చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకుని వెంటనే అమలు చేసేసిన చరిత్ర ఉన్న ప్రధాని మోడీ.. ఈసారి కేబినెట్ ప్రక్షాళన కూడా అలాగే చేయబోతున్నారన్న ప్రచారం కొనసాగుతోంది. ఇందులో భాగంగా కేబినెట్లో భారీ మార్పులు చేస్తున్నారు. ఇదే క్రమంలో హోంమంత్రి అమిత్ షా(Amit Shah)ను ఉప ప్రధానిగా నియమించబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రశ్న రావణ్, ప్రకాశ్ రాజ్ కు ఉరిశిక్ష..! సాయిరెడ్డి షాకింగ్ డిమాండ్..!
ప్రశ్న రావణ్, ప్రకాశ్ రాజ్ కు ఉరిశిక్ష..! సాయిరెడ్డి షాకింగ్ డిమాండ్..!

దీనిపై ఢిల్లీ వర్గాలతో పాటు జాతీయ మీడియాలో ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy)కూడా అమిత్ షా ఉప ప్రధాని ప్రచారంపై స్పందించారు. రాబోయే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో హోం మంత్రి అమిత్ షా ఉప ప్రధానిగా నియమితులవుతారన్న వార్తలు నిజమైతే, అది దేశ ప్రయోజనాల దృష్ట్యా స్వాగతించదగిన నిర్ణయం అవుతుందంటూ సాయిరెడ్డి ఇవాళ ట్వీట్ చేశారు.

Vijayasai Reddy Backs Amit Shah for Deputy PM Post Ahead of Cabinet Reshuffle
ఆ ఉద్యోగాలు హాట్ కేక్స్..! యూత్ రెడీగా ఉండండి-సాయిరెడ్డి టిప్స్..!
ఆ ఉద్యోగాలు హాట్ కేక్స్..! యూత్ రెడీగా ఉండండి-సాయిరెడ్డి టిప్స్..!

అమిత్ షా తన నిర్ణయాత్మక నాయకత్వ పటిమ, పరిపాలనా సామర్థ్యం, రాజకీయ చతురతను పలుమార్లు నిరూపించుకున్నారని సాయిరెడ్డి గుర్తుచేశారు. కాబట్టి అటువంటి బాధ్యతను చేపట్టడానికి ఆయన అత్యంత అర్హులని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్వహించిన పదవిని ఆయన చేపట్టడం కూడా ఎంతో సముచితంగా ఉంటుందని సాయిరెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు. దీన్ని బట్టి చూస్తే అమిత్ షా ఉప ప్రధాని అయితే బీజేపీలో తన రాకకూ మార్గం సుగమం అవుతుందని సాయిరెడ్డి భావిస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+